స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు, భారీ లాభాలతో ముగిశాయి.ఉదయం 71292 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద ముగిసింది. నిప్టీ 127 పాయింట్లు పెరిగి 21743 వద్ద ముగిసింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం 83.01 వద్ద కొనసాగుతోంది. బ్యారెల్ ముడిచమురు స్వల్పంగా పెరిగి 82.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు బంగారం 2040 డాలర్ల వద్ద కొనసాగుతోంది.