విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ చేపట్టేందుకు దేవస్థాన కమిటీ రంగం సిద్దం చేసింది. దేవాలయ పునరుద్ధరణతోపాటు నూతన ధ్వజ స్తంభ సహిత స్వర్ణ శిఖర పనులకు ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం నిర్వహణకు ముహూర్తం పెట్టారు.బుధవారం నుంచి 18వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ మీడియాకు వెల్లడించింది.
ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడటాన్ని నియంత్రించేందుకు రూ.30 కోట్లతో పనులు చేపట్టారు. ఓ వైపు దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రి పనులతోపాటు, శ్రీ మల్లీశ్వరస్వామి దేవస్థానం ధ్వజస్థంభం ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.