తిరుపతిలో
రేపటి నుంచి మూడు రోజుల పాటు పాటు దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం
నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య
కళాశాల ఆధ్వర్యంలో రేపటి (ఫిబ్రవరి 14) నుంచి
16వ వరకు నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను అలరించనుంది.
తిరుపతి
మహతి కళామందిరంలో కళావైభవం పేరిట ఈ కార్యక్రమం జరగనుంది.
ఫిబ్రవరి
14న ఉదయం 10 గంటలకు శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతా రమ్యానంద
భారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కళా వేదికలో పద్మశ్రీ డాక్టర్ ఎల్లా
వెంకటేశ్వరరావు, పసుమర్తి రామలింగ శాస్త్రి సహా ప్రముఖ కళాకారులు ఉపన్యసిస్తారు.
పలు రాష్ట్రాలకు
చెందిన విద్యార్థులు సంగీత, వాద్య, నృత్య ప్రదర్శనలతో అలరించనున్నారు.
శ్రీకృష్ణ లీలావిలాసం, శ్రీరామ
కథాసారం, భక్త ప్రహ్లాద యక్షగానం తదితర నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
టీటీడీ
పరిధిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 16న
రథసప్తమి వేడుక నిర్వహించనున్నారు.