తిరుపతి
శ్రీనివాసమంగాపురంలో వేంచేసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించే తేదీలను టీటీడీ వెల్లడించింది.
ఫిబ్రవరి 29 నుంచి మార్చి8 వరకు వార్షిక
బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు
ప్రకటనలో వెల్లడించింది.
బ్రహ్మోత్సవాలకు
ఫిబ్రవరి 28 సాయంత్రం అంకురార్పణ జరగనుంది.
ఫిభ్రవరి 29న
ఉదయం మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనుండగా అదేరాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.
01-03-2024 న ఉదయం చిన్నశేష వాహన సేవ, రాత్రికి హంస వాహన సేవ
నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల మూడో రోజు(మార్చి 2న) ఉదయం
వేళ సింహ వాహనంపై నుంచి స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రికి ముత్యపుపందిరి
వాహనంపై విహరిస్తారు.
ఆ తర్వాతి రోజు (మార్చి 3న) కల్పవృక్ష
వాహనం, సర్వభూపాల వాహనంపై కొలువు దీరతారు. ఐదోరోజున(04-03-2024)న ఉదయం స్వామికి మోహినీ
అవతారంలో పల్లకీ సేవ నిర్వహిస్తారు. రాత్రికి గరుడ వాహనం సేవ ఉంటుంది.
మార్చి 5న కళ్యాణ వేంకటేశ్వరస్వామికి మూడు వాహన సేవలు
నిర్వహిస్తారు. ఉదయం హనుమంత వాహన సేవ, అదే రోజు సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహన
సేవతో స్వామిని కొలుస్తారు. మార్చి 6న ఉదయం, సూర్యప్రభ వాహనం,
రాత్రికి చంద్రప్రభ వాహనంపై నుంచి స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తారు. ఇక ఏడో తేదీన
ఉదయ రథోత్సవం నిర్వహించనుండగా అదే రోజు రాత్రి స్వామి అశ్వవాహనంపై నుంచి భక్తులకు
దర్శనమిస్తారు.
బ్రహ్మోత్సవాలు చివరి రోజైన మార్చి8న ఉదయం చక్రస్నానం, రాత్రికి ధ్వజావరోహణతో ముగింపు
పలుకుతారు.
ఫిబ్రవరి 22న ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.