దక్షిణాఫ్రికాలోని
విల్లొమూరే వేదికగా భారత్, ఆస్ట్రేలియా
మధ్య అండర్ -19 ప్రపంచకప్ తుది సమరం రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్ మ్యాచ్ లో టాస్
నెగ్గిన ఆస్ట్రేలియా, బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 253
పరుగులు చేసింది.
భారత
బౌలర్లలో రాజ్ లింబానీ మూడు వికెట్లు తీయగా, నమన్ తివారీ రెండు, సౌమీ పాండే,
ముషీర్ చెరొక వికెట్ తీశారు.
ఓపెనర్లుగా
సామ్ కొన్ట్సాస్, హ్యారీ డిక్సన్ ఆటను ప్రారంభించగా మొదటి ఓవర్ ను రాజ్ లింబానీ
వేశాడు. తొలి ఓవర్ లో ఆసీస్ కేవలం ఒక్క పరుగే చేసింది.
రాజ్ లింబానీ వేసిన 2.3
బంతికి సామ్ కొన్ట్సాస్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిది బంతులు ఆడి పరుగులు చేయకుండానే
పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. హ్యూ విబ్జన్, డిక్సన్ కలిసి ఆరో ఓవర్‌కు 33 పరుగులు
చేశారు.
తొలి
వికెట్ నష్టపోయిన తర్వాత జాగ్రత్త పడిన ఆస్ట్రేలియా, తర్వాత నిలకడగా ఆడింది.
హ్యారీ డిక్సన్, హ్యూ విబ్జెన్ కలిసి 16 ఓవర్ ముగిసే సరికి 50 పరుగుల
భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆసీస్ స్కోరు 16 ఓవర్లకు 66
పరుగులు
చేరింది.
నమన్
తివారీ వేసిన 20.4 బంతికి ఆసీస్ రెండో వికెట్ నష్టపోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్
హ్యూ విబ్జెన్(48), ముషీర్ క్యాచ్ గా దొరికిపోయి పెవిలియన్ చేరాడు. 22.5 బంతికి
హ్యారీ డిక్సన్ (42) ఔట్ కావడంతో ఆసీస్ మూడో వికెట్ నష్టపోయింది. నమన్ తివారీ
బౌలింగ్ లో మురుగున్ అభిషేక్ అధ్యుతమైన క్యాచ్ పట్టడంతో హ్యారీ డిక్సన్
వెనుదిరిగాడు.
ఆ
తర్వాత 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబానీ
బౌలింగ్ లో ర్యాన్ హెండ్రిక్స్(20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఒలివర్ పీక్
క్రీజులోకి వచ్చాడు. హాఫ్ సెంచరీకొట్టిన హర్జస్ సింగ్(55) కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్
కావడంతో 38 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 181/5 గా
ఉంది.
ముషీర్ ఖాన్ వేసిన 39.5 బంతికి రఫ్ మ్యాక్మిల్లమ్(2)
కూడా క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. తన బౌలింగ్ లోనే ముషీర్ అద్భుతమైన డైవ్ చేసి
క్యాచ్ పట్టాడు.
40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 6 వికెట్లు నష్టపోయి 187 పరుగులు
చేసింది. లింబానీ వేసిన 45.3 బంతికి అండర్సన్(13) ఔట్ కావడంతో 46 ఓవర్లకు ఆసీస్
ఏడు వికెట్లు నష్టపోయి 223 పరుగులు చేసింది. 50 ఓవర్లకు 253 పరుగులు చేసి భారత్ ముందు 254 పరుగుల
లక్ష్యాన్ని ఉంచారు. ఓలీవర్ పీక్(46), టామ్ (8) నాటౌట్ గా ఉన్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు