వచ్చే
లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) బీజేపీ 370కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని
ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా బీజేపీకి పడేలా చూడాలని
కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
నేడు
మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, రూ. 7,550 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులను
ప్రారంభించారు. ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా ప్రజలను
ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, ప్రజా సేవకుడిగా మాత్రమే తాను పర్యటనకు వచ్చినట్లు
తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో
పనిచేస్తోందని ప్రశంసించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల ద్వారా వెల్లడించారన్నారు. అందుకే మళ్ళీ మోదీ
ప్రభుత్వం వస్తుందని విపక్షనేతలు కూడా చెబుతున్నారని ప్రస్తావించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన
కాంగ్రెస్.. 2024లో
తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
గిరిజన
ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తాను గుజరాత్ సీఎం
గా ఉన్న సమయంలో ఏజెన్సీ ఏరియాలో స్కూళ్ళు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు
చేసుకున్నారు.
గిరిజనుల
పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపిన ప్రధాని,
కాంగ్రెస్ పాలనలో కేవలం 100 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు
చేసిందన్నారు. బీజేపీ పాలనలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేశామని వివరించారు.