భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఫోన్‌ను దొంగలు కాజేశారు. కోల్‌కతాలోని గంగూలీ నివాసానికి పెయింటింగ్ పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు పెయింటర్లు ఆ పనిలో ఉన్నారు. ఇంట్లో ఆయన ఫోన్ కనిపించకుండా పోవడంతో…..ఆదివారంనాడు గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చోరీకి గురైన ఫోన్‌లో కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫోన్ చోరీకి గురైందని తెలియగానే గంగూలీ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే ఫోన్ వెతికే పని మొదలైంది. ఇంట్లో పెయింటింగ్ పని చేస్తోన్న కూలీలను, పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తన ఫోన్ వెతికిపెట్టాలని గంగూలీ పోలీసులను కోరారు. ఫోన్ పోయిందనే గకన్నా…అందులోని కీలక డేటా అసాంఘీక శక్తుల చేతిలో పడుతుందనే భయం గంగూలీని వెంటాడుతోంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు