జాతీయ
రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ అంతరాయ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం
సన్నద్ధమైంది. టోల్ ఫీజుల చెల్లింపుల సమస్యను పరిష్కరించి ప్రయాణాలు సాఫీగా సాగేందుకు
చర్యలు చేపట్టింది. ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ రుసుం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దశల వారీగా అమలు
చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినట్లు
నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
పైలెట్
ప్రాజెక్టు ఫలితాలు, హహనదారుల డాటా ప్రైవసీ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఈ
ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తామని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ స్పష్టం
చేసింది. ఎంపిక చేసిన రహదారులపై పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు జాతీయ రహదారులు
మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.
అభివృద్ధి
దశలో ఉన్న ఈ విధానాన్ని అన్నిరకాలుగా పరీక్షించిన తర్వాతే దేశవ్యాప్తంగా అమలు
చేస్తామని వివరించారు.
ప్రస్తుతం,
జాతీయ రహదారుల ద్వారా ప్రభుత్వానికి రూ. 40 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, వచ్చే రెండు
మూడేళ్ళ లో ఈ ఆదాయం రూ. 1.40 లక్షల కోట్లకు చేరుతుందన్నారు.
2018-19లో
టోల్ ప్లాజాల వద్ద వాహనాల సగటు నిరీక్షణ సమయం, 8 నిమిషాలుగా ఉండగా, 2020-21లో
ఫాస్టాగ్ ఏర్పాటు ఈ నిరీక్షణ సమయం 47 సెకన్లు తగ్గింది. దీంతో 2021 నుంచి వాహనాలకు
ఫాస్టాగ్ ను తప్పనిసరి చేశారు.
పాస్టాగ్ లేని వాహనాల నుంచి టోల్ ప్లాజాల వద్ద
రెట్టింపు రుసుం వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక టోల్ ప్లాజాల
వద్ద ప్రత్యేక రోజులు, రద్దీ సమాయాల్లో
భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో జీపీఎస్ ఆధారిత టోల్ రుసం
చెల్లింపు విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
కొత్త
విధానం ఎలా పని చేస్తుందంటే… ?
వాహనంలోని జీపీఎస్ పరికరాలు, ఏఎన్పీఆర్ కెమారా పరికరాలు
రోడ్డుపై ఎంత దూరం ప్రయాణించింది లెక్క గడతాయి. దీనికి ఎంత మొత్తం చెల్లించాల్సింది
కూడా ఈ టెక్నాలజీలో అప్పటికప్పడే వాహనదారుడికి అందుతుంది. వాహనం డ్రైవర్, యాజమాని
ప్రీ పెయిడ్ ఖాతా, బ్యాంక్ ఖాతా నుంచి దీనిని ఆటోమెటిక్ గా చెల్లించే అవకాశం
కల్పిస్తున్నారు. అంటే ప్రతీ వాహనదారుడు జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేయాల్సి
ఉంటుంది.