భారత్‌లో అక్రమంగా నివశిస్తోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని ఓ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు.వారిని పన్వెల్‌లోని నద్వే వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఖిదుక్‌పాడలో తనిఖీలు నిర్వహించిన ఏటీఎస్ అధికారులు ఇద్దరు బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు.
దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు ఆధార్, వోటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారని అధికారులు తెలిపారు. పాస్‌పోర్ట్ నిబంధనలు 1950, విదేశీయుల చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వలసలతో సంబంధాలు కలిగిన వారిపై ఏటీఎస్ విచారణ చేస్తోంది.