హమాస్ ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ గాజాలో శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో హజెం హనియో చనిపోయినట్లు భావిస్తున్నారు.
గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించిన కాసేపటికే దాడులు మొదలయ్యాయి. ఆ తరవాత లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.
తాజాగా ఇజ్రాయెల్ రఫాపై చేస్తున్న దాడులను పలు దేశాలు ఖండించాయి. రాఫాను ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోందంటూ అమెరికా ఆరోపించింది. గాజాలోని సగం జనాభా రఫాలో నివశిస్తోంది. ఇలాగే దాడులు కొనసాగిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.