కాసేపట్లో
అండర్ -19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ పోరు ప్రారంభంకానుంది. దక్షిణాఫ్రికాలోని విల్లేమొరి
వేదికగా ఇరు జట్లు పోటీ హోరాహోరీగా సాగనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమెరుగని భారత కుర్రాళ్ళు,
తొమ్మిదోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యారు.
సెమీఫైనల్లో
దక్షిణాఫ్రికాను ఓడించి భారత యువజట్టు పైనల్ కు చేరగా పాకిస్తాన్ పై విజయంతో ఆసీస్
తుది పోరుకు అర్హత సాధించింది. అండర్- 19 విభాగంలో భారత్ ఇప్పటి వరకు రెండు సార్లు
ఆస్ట్రేలియాను ఓడించి కప్పు గెలిచింది.
2012,
2018లో భారత్, అండర్-19 ప్రపంచకప్ కైవసం చేసుకోగా, ఫైనల్ కు చేరడం భారత్ కు ఇది ఐదో సారి కావడం
విశేషం.
గ్రూప్,
సూపర్ సిక్స్, సెమీస్ లో భారత్ జట్టును కెప్టెన్ ఉదయ్ సహారన్ ముందుండి నడిపించాడు.
ఉదయ్ తో పాటు ముషీర్, సచిన్ బ్యాటింగ్ విభాగంలో జట్టుకు అండగా నిలుస్తుండగా
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ సౌమి పాండే, పేసర్ నమన్ తివారీ జట్టును విజయం వైపు
నడపడంలో కీలకంగా మారారు.
ఆస్ట్రేలియా
కూడా బలంగానే ఉంది. కెప్టెన్ హ్యూ విబ్జెన్, హ్యారీ డిక్సన్, టామ్ స్ట్రాకర్, కలం
విడ్లర్ సత్తా చాటుతున్నారు.
2000,
2008, 2012, 2018, 2022 భారత్ జట్టు అండర్ 19 ట్రోఫీ గెలిచింది.