పిల్లలపై లైగింక వేధింపుల కేసులో దోషిగా రుజువైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడంతో హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ నిరసనలు వ్యక్తం అయ్యారు. దీంతో ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖైదీకి క్షమాభిక్ష పెట్టి తప్పుచేశానని, ఈ వ్యవహారంలో ఆవేదనకు గురైన వారు తనను క్షమించాలంటూ కేటలిన్ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో కోరారు.
బాలికల సంరక్షణ కేంద్రం నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడనే కేసు రుజువైంది. దీనిపై హంగేరీ అధ్యక్షురాలు నోవక్ క్షమాభిక్ష పెట్టారు. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు భారీ నిరసనకు దిగాయి. దీంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
శుక్రవారం నుంచి ప్రతిపక్షాలు హంగేరీ అధ్యక్షురాలి ఇంటి ముందు నిరసనకు దిగాయి. ఖతార్ పర్యటనలో ఉన్న నోవాక్ (internationanews) హుటాహుటిన హంగేరీ చేరుకున్నారు. వెంటనే రాజీనామా చేశారు. క్షమాభిక్ష సరైన నిర్ణయం కాదని ఆమె క్షమాపణలు చెప్పారు. బాధితుల పక్షాన నిలుస్తున్నట్లు ప్రకటించారు.