భూ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేసు రాజ్యసభ ఎంపీకి చుట్టుకుంది. సోరెన్ నివాసంలో పట్టుబడ్డ లగ్జరీ కారు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందినదిగా ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై శనివారంనాడు ఈడీ అధికారులు ధీరజ్ సాహును పదిగంటలు పైగా విచారించారు. తదుపరి విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
లగ్జరీ కారు అనేది పెద్ద విషయం కాదు. ఆ కారు సీఎంకు చెందినది కాదు. అది ఇతరుల కారు. విచారణ కారు గురించి కాదంటూ విలేకరులకు సాహు వెల్లడించారు. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు జనవరి 31న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు సమయంలో ఈడీ అధికారులు 36 లక్షల నగదు, 2 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ అధికారులు డిసెంబరులో జరిపిన సోదాల్లో రూ.300 కోట్ల నల్లధనం సీజ్ చేశారు. ఆ కేసు ఎదుర్కొంటోన్న కాంగ్రెస్ నేతకు ధీరజ్ సాహు సమీప బంధువు కావడంతో ఈడీ అధికారులు విచారిస్తున్నారని తెలుస్తోంది.