గత పదేళ్ళ ఎన్డీయే ప్రభుత్వ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం
పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. 17వ లోక్‌సభ చివరిరోజు సమావేశాల్లో మాట్లాడిన ప్రధాని, గత
ఐదేళ్లలో అద్భుతమైన మార్పులతో పాటు ఆవిష్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశాన్ని
తామెప్పుడూ వెనకడుగు
వేయనివ్వలేదన్న మోదీ, 17వ లోక్‌సభను దేశం తప్పకుండా
ఆశీర్వదిస్తుందన్నారు.
‘ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్
భవనాన్ని నిర్మించుకోవడంతో పాటు మార్గదర్శకంగా సెంగోల్‌ను స్థాపించుకున్న
విషయాన్ని సభలో ప్రధాని గుర్తు చేసుకున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని
ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు జీ20 సమావేశాలను భారత్ వేదికగా నిర్వహించడంతో దేశ
ప్రతిష్ఠ ఇనుమడించిందన్నారు.
దేశవ్యాప్తంగా
స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కాగిత రహిత పార్లమెంట్, డిజిటలైజేషన్ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
రీ
ఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంగా పేదల జీవితాల్లో
వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ముందుకు
సాగుతోందన్నారు. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరగడంతో పాటు ఈ విడత పార్లమెంట్
సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు కీలకమైనవి అన్నారు.
ఆర్టికల్ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు
శాంతి చేకూరిందన్నారు. మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం
తెచ్చామన్ని మోదీ, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను తమ
ప్రభుత్వం కాపాడిందన్నారు.
మరో
పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని ఆకాంక్షించిన ప్రధాని మోదీ,
వికసిత్
భారత్ ఫలాలు మన భావితరాలకు అందుతాయాన్నారు.
ప్రశ్న ప్రతాల లీకేజీ యువత పాలిట శాపంగా మారడంతో కఠిన
శిక్షలు పడేలా చట్టం తెచ్చామన్నారు. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం
భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.