పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం ఓ డ్రోన్‌ను కూల్చివేసింది. పంజాబ్ పాక్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్యం కూల్చివేసిన డ్రోన్, చైనాలో తయారైందని తెలుస్తోంది. క్వాడ్ కాప్టర్ డ్రోన్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించడంతో బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి.
డ్రోన్ గుర్తించిన వెంటనే బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి కూల్చివేశాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా రోసీ గ్రామ పొలాల్లో డ్రోన్ కూలిపోయింది. పాక్షికంగా దెబ్బతిన్న డ్రోన్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. కూలిపోయిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్ డ్రోన్ చైనాలో తయారైందనిగా సైన్యం గుర్తించింది. డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా సాగుతోంది. డ్రోన్లను కూల్చి వేయడం ఇటీవల కాలంలో ఇది రెండోసారని అధికారులు ప్రకటించారు.