పెట్టుబడిదారుల ఆదరణ చూరగొన్న గోల్డ్ బాండ్స్ (gold bands) మరోసారి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజులపాటు గోల్డ్ బాండ్స్ సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఒక్కో గ్రాము బంగారం రూ.6263గా రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్స్ విడుదల చేయడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంటుంది.
బంగారం కొనుగోళ్లు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో గోల్డ్ బాండ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఒక గ్రాము ఒక యూనిట్ కింద ఉంటుంది. గరిష్ఠంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు 20 కేజీలు కొనుగోలుచేయవచ్చు. గోల్డ్ బాండ్ గడువు 8 ఏళ్లు. గడువు ముగియగానే అప్పటి ధర ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఐదేళ్లు కనీసం పథకంలో కొనసాగాలి. ఆ తరవాత ఎప్పుడైనా వైదొలగవచ్చు.