పౌరసత్వ
సవరణ చట్టం (CAA) ను ఎన్నికల్లోపు దేశవ్యాప్తంగా అమలు
చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సీఏఏ విషయంలో ముస్లిం సోదరులను
కొందరు తప్పుదోవ పట్టించారని, ఏ ఒక్కరి భారతీయ పౌరసత్వాన్ని ఈ చట్టం ద్వారా
గుంజుకోవడం లేదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్తాన్ నుంచి పీడన కారణంగా భారత్ కు వలస వచ్చిన
శరణార్థులకు కూడా కూడా పౌరసత్వం ఇస్తామన్నారు.
ఉమ్మడి
పౌరస్మృతి(UCC) అమలు రాజ్యాంగ అజెండా అని దేశ తొలిప్రధాని,
సహా పలువురు ఈ అంశంపై సంతకం చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. కాంగ్రెస్
పార్టీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా యూసీసీ అమలును ఆ పార్టీ పక్కన పెట్టిందని
దెప్పిపొడిచారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు ఆమోదంపై స్పందించిన అమిత్
షా, దానిని సామాజిక మార్పుగా అభివర్ణించారు. వివిధ రకాల వేదికపై ఈ విషయం గురించి
చర్చించడంతో పాటు న్యాయసమీక్షకు కూడా నిలబడిందన్నారు.
లౌకికవాద దేశంలో మతం ఆధారంగా
చట్టాలు ఉండకూడదన్నారు.
ఈటీ
గ్లోబల్ సమ్మిట్ -2024లో పాల్గొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా, పలు విషయాలపై
స్పందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని, ఎన్డీయే
కూటమి బలం 400 సీట్ల మార్కు దాటుతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో
మూడో సారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
లోక్
సభ ఎన్నికల ఫలితాల విషయంలో తమకు ఎలాంటి ఆందోళన
లేదని తేల్చి చెప్పిన అమిత్ షా, కాంగ్రెస్
సహా ఇతర ప్రత్యర్థిపార్టీలు మరో మారు ప్రతిపక్షంలో స్థానంలో కూర్చోవడం ఖాయమన్నారు. ఈ
విషయాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కూడా గ్రహించాయన్నారు.
జమ్ము-కశ్మీర్
అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తమ ప్రభుత్వం వచ్చే
ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు.ఆర్టికల్
370 రద్దుకు ప్రతిఫలంగా దేశ ప్రజలు, బీజేపీ అభ్యర్థులను 370 సీట్లలో గెలిపిస్తారని,
ఎన్డీయే కూటమి బలం 400 మార్కు దాటుతుందన్నారు.
రాష్ట్రీయ
లోక్ దళ్, శిరోమణి ఆకాలిదళ్ పార్టీలు ఎన్డీయేలో చేరికపై వస్తున్న వార్తలపై కూడా
అమిత్ షా స్పష్టత ఇచ్చారు. కుటుంబ నియంత్రణ విధానాన్ని రాజకీయాల్లో భారతీయ
జనతాపార్టీ అనుసరించమంటూ నవ్వులు పూయించారు. మరిన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే
కూటమిలో చేరుతున్నాయని చెప్పకనే చెప్పారు.
శిరోమణి
అకాళీదళ్ తో చర్చలు జరుగుతున్నాయని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.
2024 లోక్
సభ ఎన్నికలు, ఎన్డీయే, ఇండీ కూటమి మధ్య మాత్రమే జరగడం లేదన్న అమిత్ షా.. అభివృద్ధి,
కేవలం నినాదాలు ఇచ్చే వారి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించగా, 1947లో
దేశవిభజనకు కారణమైన నేతల వారసులకు, దేశంపేరిట పాదయాత్ర చేసే హక్కు ఎక్కడిదని
ప్రశ్నించారు.
ఈ
సమయంలో ఎన్డీయే ప్రభుత్వం, తన పదేళ్ళ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే
ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు. 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోయినప్పుడు ఈ దేశ
పరిస్థితి ఎలా ఉందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్
నేతృత్వంలోని యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉండగా, అన్ని శాఖల్లోనూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన విషయాన్ని గుర్తు
చేశారు. విదేశీ పెట్టుబడులు కూడా రాలేదన్నారు.
ఆ సమయంలో శ్వేతపత్రం విడుదల చేస్తే
ప్రపంచానికి తప్పుడు సమాచారం వెళ్ళేదన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత
ఆర్థిక వ్యవస్థను సమీక్షించి గాడిలో పెట్టిందన్నారు. పదేళ్ళలో అవినీతి రహిత పాలన
అందించిందన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించామని అందుకే శ్వేతపత్రం ఈ సమయంలో
విడుదల చేశామని వివరించారు.
శ్రీరాముడు
జన్మించిన అయోధ్యలో 500 ఏళ్ళ కిందట రామాలయం ఉందని దేశం మొత్తం విశ్వసిస్తోందన్న
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అందుకే అక్కడ ఆలయం నిర్మాణం జరిగిందన్నారు.
బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపుతూ ఇన్నాళ్ళూ
మందిర నిర్మాణం చేయలేదంటూ కాంగ్రస్ ను ఉద్దేశించి ఎత్తిపొడిచారు.