Uttarakhand Violence: 5 arrested, 3 FIRs registered with 19 names
ఉత్తరాఖండ్ హల్ద్వానీ జిల్లాలో ముస్లిముల
హింసాకాండకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. మూడు ఎఫ్ఐఆర్లు
నమోదు చేయగా వాటిలో 19మంది వ్యక్తుల పేర్లు జత చేసారు. సుమారు 5వేల మంది ఆగంతకులు
హింసాకాండకు పాల్పడ్డారంటూ వారిలో కేవలం 19మందిని మాత్రమే స్పష్టంగా గుర్తించారు.
ఈ నెల 8న హల్ద్వానీలోని బాణ్బూల్పురా ప్రాంతంలో
అక్రమ ఆక్రమణలను కూల్చివేయడానికి నగరపాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో
స్థానికంగా నగరపాలక స్థలాన్ని ఆక్రమించి కట్టిన మదరసా, మసీదులను కూల్చేసేందుకు
అధికారులు ప్రయత్నించారు. దాంతో స్థానిక ముస్లిములు తిరగబడ్డారు. పోలీసులపై దాడి
చేసారు. పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఆ హింసాకాండలో ఆరుగురు మరణించారు, వందమంది
పోలీసులు సహా సుమారు 250 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో
ఉందని, కొత్తగా హింస ఏమీ చెలరేగలేదనీ పోలీసులు వెల్లడించారు. హల్ద్వానీలో కర్ఫ్యూ
ఎత్తివేసామనీ, బాన్బూల్పురాలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోందని రాష్ట్ర ఏడీజీ
అన్షుమన్ చెప్పారు.
శుక్రవారం నాడు రాష్ట్రముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హల్ద్వానీ ప్రాంతాన్ని
సందర్శించారు. పోలీసు అధికారులు, అందునా మహిళలపై దాడి చేయడాన్ని తీవ్రంగా
ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారందరి వీడియో
ఫుటేజ్, వారి కాలిజాడలు అందుబాటులో ఉన్నాయని సీఎం చెప్పారు. దుండగులను గుర్తించి,
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు
తీసుకోవాలని పోలీసులను సీఎం ఆదేశించారు.