ఇంగ్లండ్
తో జరగనున్న మూడు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ కు దూరమయ్యాడు. కోహ్లీ
నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవించి మద్దతుస్తుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి
జైషా తెలిపారు.
గాయం
కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్రధానజట్టులోకి తిరిగి
వచ్చారు. అయితే వీరికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావాల్సి
ఉంది.
ఆల్‌రౌండర్
సౌరభ్ కుమార్, అవేష్ ఖాన్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసిన బోర్డు, బెంగాల్ ఆటగాడు
ఆకాశ్ దీప్‌కు అవకాశం కల్పించింది.
ఫిబ్రవరి
15న రాజ్‌కోట్ వేదికగా
మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, ఫిబ్రవరి 23 నుంచి నాలుగో
టెస్ట్, రాంచీలో జరగనుంది. ఆఖరి ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7న ధర్మశాల వేదికగా
జరగనుంది.
ఇంగ్లండ్
తో మూడు టెస్టులకు భారత జట్టు…
రోహిత్
శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్,
కేఎల్ రాహుల్*, రాజత్ పటీదార్, సర్ఫరాజ్
ఖాన్, ద్రువ్ జురేల్(వీకెట్ కీపర్), కేఎస్ భరత్(వీకెట్ కీపర్,) ఆర్ అశ్విన్,
రవీంద్ర జడేజా*, అక్షర పటేల్, వాషింగ్టన్
సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.