ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లోని నగదుపై వడ్డీరేటు ఖరారైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతం వడ్డీ నిర్ణయించారు. ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ నిర్ణయం తీసుకుంది. గడచిన మూడేళ్లలో ప్రస్తుతం ప్రకటించిన వడ్డీరేటు అత్యధికం కావడం గమనార్హం.
సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు పంపనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపిన తరవాత పెరిగిన వడ్డీరేటు అమల్లోకి వస్తుంది. ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలగనుంది. సీబీటీ నిర్ణయానికి ఆర్థిక శాఖ త్వరలో ఆమోదం తెలపనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. దాన్ని. 0.15 శాతం మేర పెంచారు.