ప్రపంచ సుందరి(మిస్ వరల్డ్) 71వ విడత పోటీల షెడ్యూల్
ఖరారైంది. భారత్ వేదికగా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మనదేశంలో ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. దిల్లీలో ప్రారంభ వేడుకతో పోటీలు ప్రారంభమై
మార్చి 9న ముంబైలో ముగుస్తాయి. భారత్ మండపం సహా వివిధ వేదికల్లో పోటీలు జరగనుండగా,
120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటున్నారు.
భారత్ లో చివరిసారిగా 1996లో పోటీలు జరిగాయి. 71 వ మిస్ వరల్డ్
ఫెస్ట్ కోసం దిల్లీలో నిర్వహించిన ప్రీ ఈవెంట్ లో ప్రస్తుత మిస్ వరల్డ్ సహా
నలుగురు మాజీ విజేతలు పాల్గొన్నారు.
ప్రస్తుత ప్రపంచ సుందరి కరోలినా బిలాస్కా(పోలెండ్), మాజీ విజేతలు
అన్ సింగ్, వనెస్సా పోన్సీ, మానుషీ చిల్లర్, స్టిఫేనీ డెల్ వాలీలు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.
భారత్ లో ప్రపంచ సుందరి పోటీలు జరగడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని మిస్
వరల్డ్ సంస్థ సీఈవో, అధ్యక్షురాలు
జులియా మోర్లే అన్నారు.
భారత టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం
జరుగుతోంది. మార్చి 9న ముంబైలో ఫైనల్స్ జగరనున్నాయి. 1951 నుంచి మిస్ వరల్డ్ పోటీలు
జరుగుతున్నాయి.