భారత సంతత వ్యక్తి మరో ఘనత సాధించారు. అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన వ్యక్తి జయేశ్ బల్సారాను నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.ఇదే కోర్టులో బల్సారా 2017 నుంచి పనిచేస్తున్నారు. ఈ తరహా పదవిని చేపట్టిన దక్షిణాసియా దేశాలకు చెందిన మొదటి వ్యక్తిగా జయేశ్ చరిత్ర సృష్టించారు.
భారత్ నుంచి ఐదు దశాబ్దాల కిందట జయేశ్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అలా వలస వెళ్లిన దంపతుల కుమారుడే బల్సారా. దివాలా, కాంట్రాక్టులు, సెక్యూరిటీలు, నియంత్రణ న్యాయ వ్యవహారాల్లో జస్టిస్ జయేశ్ నిపుణుడు. బల్సారా తండ్రి న్యూయార్క్ సిటీ కార్పొరేషన్లో ఇంజనీరుగా పనిచేశారు. తల్లి నర్సుగా సేవలందించారు.