లోక సభ ఎన్నికలు తేదీ సమీపిస్తున్న
వేళ భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. సుమారు 97 కోట్ల మంది పోలింగ్
ప్రక్రియలో పాల్గొననున్నట్లు తెలిపింది.
వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడానికి
దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత సాధించనున్నట్లు తెలిపిన ఎన్నికల సంఘం, 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 20 కోట్ల మంది యువ ఓటర్లు తమ
హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొంది.
గత లోక్సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య
6 శాతం మేర పెరిగినట్లు ‘ఎక్స్’
వేదికగా వెల్లడించింది.
ప్రపంచంలో
అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు
వేయబోతున్నట్లు ఈసీ పేర్కొంది.
లింగ
నిష్పత్తి విషయంలో పెరుగుదల ఉందని, 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024
నాటికి 948కి చేరిందని ఈసీ పేర్కొంది.
ప్రత్యేకంగా దృష్టిసారించి
పారదర్శకతతో జాబితాను రూపొందించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.