ప్రధాని
నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పల
అంశాలపై చర్చించారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయానికి వెళ్ళిన సీఎం జగన్ దాదాపు
గంటన్నర సమయం పాటు వివిధ అంశాల గురించి చర్చించారు.
పోలవరం
ప్రాజెక్టు నిర్మాణానికి 12,911 కోట్లు నిడుదల విడుదలు చేయడంతో పాటు కాంపోనెంట్ వారీగా
సీలింగ్ ఎత్తి వేసే అంశాలను ప్రధాని వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు.
కేంద్రం
అంగీకరించినప్పటికీ కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉందని దీనిపై దృష్టి సారించాలని
విన్నవించారు.
పోలవరం
ప్రాజెక్టు మొదటి విడత పనులు పూర్తి చేసేందుకు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే
దీనికి సంబంధించిన ప్రతిపాదన జలశక్తిశాఖ వద్ద పెండింగ్ లో ఉందని, పరిశీలించి ఆమోదం
తెలపాలని కోరారు.
2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించి రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని
సీఎం జగన్, ప్రధాని మోదీని కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా
అమలు చేయాలని కోరిన సీఎం, రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమన్నారు. పెట్టుబడులు రావడంతో పాటు యువతకు ఉపాధి
అవకాశాలు లభిస్తాయని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో
వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అవసరమన్నారు.
భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు
విడుదల చేయాలని కోరారు.
విభజన
చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా
బెంగుళూరు వరకూ పొడిగించే అంశాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించి అవసరమైన సాయం
అందేలా చూడాలన్నారు.
రాయలసీమ
ప్రాంతంలో రైల్వే మార్గాలను విస్తరించి కనెక్టవిటీ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని
ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు.