తెలంగాణ తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరశింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. మరో మాజీ ప్రధాని చరణ్‌సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా అత్యున్నత భారతరత్న పురస్కారం ప్రకటించారు. పీవీ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇటీవల బీజేపీ అగ్రనేత అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు కూడా భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మాజీ ప్రధాని పీవీ, ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. దేశం ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టి గండం నుంచి గట్టెక్కించారు. 1991లో నాడు పీవీ నరశింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు అనేక రంగాల్లో అనూహ్య మార్పులకు దారితీశాయి. ఇక రైతు నాయకుడిగా పేరుబడిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ సేవలను కూడా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గుర్తుచేసుకున్నారు.