The launch of the GSLV-F14/INSAT-3DS is set for February 17, 2024, at 17:30 Hrs,
SDSC-SHAR, Sriharikota, improved weather forecasts and meteorological
services
భారత
అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత ఖచ్చితమైన వాతావరణ అంచనాల కోసం
జీఎస్ఎల్వీ-ఎఫ్14/ ఇన్సాట్-త్రీడీఎస్ మిషన్ (GSLV-F14/INSAT-3DS Mission)ను నింగిలోకి పంపనుంది.
ఈ నెల 17(ఫిబ్రవరి
17)న సాయంత్రం 5.30 గంటలకు శ్రీహరి కోట నుంచి జీఎస్ఎల్వీ –ఎఫ్ 14 రాకెట్‌ను ప్రయోగించనుంది.
దీని ద్వారా ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్
ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టనుంది.
వాతావరణ
పరిశీలన, అంచనాతో పాటు భూ, సముద్ర ఉపరితల పర్యవేక్షణకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
ప్రకృతి విపత్తులను అంచనా వేసి అప్రమత్తం చేయడం కూడా ఈ ప్రయోగ లక్ష్యాల్లో ఒకటి.
ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ ఈ ప్రయోగం
కోసం నిధులు కేటాయించింది.
భారత
వాతావరణ విభాగం, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ విభాగాలు, వాతావరణ
అంచనాల కోసం ఇన్సాట్-3 డీఎస్ సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.