తెలుగు రాష్ట్రాల్లో కీలక రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1746 కోట్లు. దీని నిర్మాణం పూర్తి చేస్తే విజయవాడ, హైదరాబాద్ మధ్య 80 కి.మీ దూరం తగ్గనుంది.
మోటుమర్రి – విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్‌ను డబుల్ లైన్‌గా విస్తరించడానికి కమిటీ అంగీకరించింది. మోటుమర్రి సమీపంలో 10 కి.మీ పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి రానుంది. ఇలాంటిది విజయవాడలో ఇప్పటికే ఒకటి ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవది కానుంది.