ఉత్తరాఖండ్లో హింస చెలరేగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 250 మంది గాయపడ్డారు. హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా, దాని పక్కన ఉన్న
మసీదు కూల్చివేత చర్యలతో వివాదం మొదలైంది. ఘర్షణ కారణంగా నలుగురు ప్రాణాలు
కోల్పోగా 250 పైచిలుకు మంది గాయపడ్డారు.
హింస ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కనిపిస్తే
కాల్చివేత చర్యలు చేపట్టిన పోలీసులు నగర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్
నిషేధించడంతో పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
హల్ద్వానీలోని బాన్భూల్పురాలో అక్రమంగా
నిర్మించిన కట్టడాలు తొలగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో
భారీ భద్రత మధ్య పోలీసులు, మున్సిపల్ అధికారులు కూల్చి వేత చర్యలు చేపట్టారు. మదర్సా, మసీదు పడగొట్టవద్దంటూ స్థానికులు
ఆందోళనకు దిగి పోలీసులు, సిబ్బందిపై రాళ్ళ దాడి చేశారు.
ఆందోళనకారుల దాడిలో 50 మంది పోలీసులు
గాయపడగా, మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయులు కూడా అల్లర్లలో చిక్కుకుపోయారు.
అల్లరి
మూకల హింసాత్మక చర్యలను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టారు. మంటలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు కూడా
వ్యాపించాయి. అప్రమత్తమైన పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన మదర్సా,
మసీదును కూలగొట్టాలని కోర్టు ఆదేశించిందని, ఆమేరకు చర్యలు చేపట్టగా అడ్డుకున్నారని
ఎస్సీ ప్రహ్లాద్ మీనా తెలిపారు. కూల్చివేత చర్యలు ప్రారంభించిన వెంటనే స్థానికులు
మహిళలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారని, బ్యారికేడ్లను తోసేసారని
చెప్పారు.
ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ,
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగిందని, కొంతమంది
సంఘ విద్రోహ శక్తులకు హింసకు ప్రేరేపించడంతోనే ఘర్షణలు మొదలయ్యాయన్నారు. ప్రజలంతా
శాంతి, సహనంతో మెలగాలని ఆయన కోరారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను గురువారం
విచారించిన ఉత్తరాఖండ్ హైకోర్టు, ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. విచారణను
ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు