పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండల పరిధిలో దారుణం జరిగింది.
కొందరు దుండగులు, దేవతా విగ్రహాల విషయంలో మూర్ఖపు చర్యలకు పాల్పడ్డారు. దొడ్డిపట్ల
గ్రామంలోని కేశవస్వామి ఆలయంలో మూలమూర్తితో పాటు ఉత్సవ విగ్రహాలపై రసాయనలు చల్లి
పైశాచికత్వానికి పాల్పడ్డారు.
గర్భగుడి ప్రధాన ద్వారం గ్రిల్స్ నుంచి
మూలమూర్తి, ఉత్సవ విగ్రహాలు, శఠగోపం, ఆంజనేయ స్వామి విగ్రహంపై రసాయనాలు చల్లినట్లుగా
సంఘటనా స్థలాన్ని పరిశిలీస్తే అర్థం అవుతోంది. విషయాన్ని గుర్తించిన ఆలయ అర్చకుడు
నరసింహాచారి, ఆలయ అధికారికి సమాచారం అందజేశారు.
తాను గుడికి వచ్చే సరికి దుర్వాసన
వస్తోందని, దుర్వాసనతో కూడిన ద్రావకం చల్లినట్లు గ్రహించి ఆలయ అధికారికి ఫోన్
ద్వారా వివరించానన్నారు.
ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలు దాదాపు 8 నెలలుగా
పనిచేయడం లేదు. దీంతో దుండుగులను గుర్తించడం కష్టంగా మారిందని స్థానికులు
చెబుతున్నారు.
విషయం
తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు, హిందూ సంఘాల నేతలు, భజరంగ్ దళ్ సేవకులు ఆలయం
వద్దకు చేరకున్నారు. హిందూ దేవీదేవతలను అగౌరవపరస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
నినదించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
చేయాలని నిర్ణయించారు.