జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్‌లోని వరవరరావు మేనల్లుడు వేణుగోపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయనతోపాటు మావోయిస్టు నేత నర్ల రవిశర్మ ఇళ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు గురువారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లో దాదాపు నాలుగు బృందాలు సోదాలు నిర్వహించాయి.
మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇంటి నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం (gangstar nayeem)బెదిరింపులకు సంబందించి వేణుగోపాల్ తన పత్రిక వీక్షణంలో రాసిన కథనాలు, కొందరు మావోయిస్టుల ఫోటోలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మావోయిస్టుల (crime news) కదలికలపై వచ్చిన పుస్తకాన్ని, కొన్ని కరపత్రాలను కూడా అధికారులు తీసుకెళ్లారు.
పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో ఎన్ఐఏ (nia raids)దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంజయ్‌దీపక్‌రావు కనుసన్నల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు (maoists) విస్తరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఎన్ఐఏ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
తాజా దాడుల్లో కీలక సమాచారం స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వేణుగోపాల్, రవిశర్మను పదో తేదీ విచారణకు హాజరుకావాలని కోరారు. తమను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని దాడుల అనంతరం వేణుగోపాల్ మీడియాకు చెప్పారు.