దళితులపై
దాడులు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
పాల్గొన్న పురందరేశ్వరి, బస్తీ సంపర్క్ అభియాన్ (దళితరచ్చబండ) పోస్టర్, కరపత్రాలు ఆవిష్కరించారు.
బీజేపీ
బలోపేతంలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర పోషించాలని సూచించిన పురందరేశ్వరి, దళితుల పట్ల వైసీపీ
ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు.
8
వేల పంచాయతీల్లో దళిత రచ్చబండ నిర్వహించి వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక
విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. దళితుల సంక్షేమం కోసం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు.