దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.రిజర్వు బ్యాంకు పరపతి విధాన నిర్ణయాలు మర్కెట్లను నిరుత్సాహానికి గురిచేశాయి. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగించడంతో పెట్టుబడిదారులు నిరుత్సాహానికి గురయ్యారు. ధరలు తగ్గించేందుకు, ద్రవ్యోల్భణం అదుపు చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా పెట్టుబడిదారులను ఆకర్షించలేదు. 4 శాతంపైగా రిటైల్ ద్రవ్యోల్భణం ఉండటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది.
ఉదయం నుంచి మార్కెట్లు ఊగిసలాటల మధ్య కొనసాగాయి. ఓ సమయంలో 900 పాయింట్లుపైగా నష్టపోయిన సెన్సెక్స్, తరవాత కొద్దిగా కోలుకుంది. చివరకు 723 పాయింట్ల నష్టంతో 71428 వద్ద ముగిసింది. నిఫ్టీ 212 పాయింట్లు కోల్పోయి, 21717 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్, ఎస్‌బీఐ, రియలన్స్ షేర్లు లాభాలార్జించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 82.95గా ఉంది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చవిచూశాయి.ఔన్సు బంగారం ధర 2050 డాలర్లకు దిగి వచ్చింది. ముడిచమురు బ్యారెల్ 79.35 వద్ద ట్రేడవుతోంది.