కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 48 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకుడు బాబా సిద్ధిక్ పార్టీ వీడారు. పార్టీ పదవులకు, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
విద్యార్థి నాయకుడిగా సిద్ధిక్ రాజకీయ జీవితం ప్రారంభించారు. మొదట ముంబై కార్పొరేషన్ కార్పొరేటర్‌గా గెలిచారు. 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాంద్రా పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచి పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు.
త్వరలో సిద్ధికి ఎన్సీపీలో చేరే అవకాశముంది. ఇప్పటికే ఆయన అజిత్ పవార్‌ను కలిశారు.మహారాష్ట్రలో మిలింద్ దేవ్‌రా రాజీనామా చేసిన కొద్ది రోజులకే సిద్ధిక్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.