భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (home minister amit sha) ప్రకటించారు. మయన్మార్ దేశంలో కల్లోలం నెలకొనడంతో తిరుగుబాటుదారులతో పోరాడలేక అక్కడి సైన్యం భారత్‌లోకి ప్రవేశిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య విచ్చలవిడిగా రాకపోకలను నిలిపేసింది.
మయన్మార్ సరిహద్దును కంచె నిర్మాణం ద్వారా కట్టుదిట్టుం చేయనున్నట్లు అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దేశ భద్రతతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు రద్దు చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్‌తో సరిహద్దు కలిగిఉన్నాయి. రెండు దేశాల మధ్య ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు తిరుగుతున్నారు. ఇటీవల చొరబాట్లు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. రెండు దేశాల మధ్య 1643 కి.మీ కంచె నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మణిపూర్ మోరేలో ఇప్పటికే 10 కి.మీ మేర కంచె నిర్మాణం పూర్తి చేశారు.