బడ్జెట్
సమావేశాల సందర్భంగా పార్లమెంటులో నేడు, స్నేహపూరిత వాతావరణం చోటుచేసుకుంది. రాజకీయ
సైద్ధాంతిక విబేధాలకు అతీతంగా ప్రధాని మోదీ వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత,
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
చట్ట
సభ్యులకు మన్మోహన్ సింగ్ ఆదర్శమన్నారు.
త్వరలో 56 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ
చేయనున్నారు. వారికి గురువారం నాడు సభలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన
ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు.
రాజ్యసభలో
ఓ బిల్లుపై ఇటీవల జరిగిన ఓటింగ్ సందర్భంగా ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన
వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారన్నారు.
ఓ సభ్యుడిగా మన్మోహన్ ఎంత బాధ్యతగా వ్యవహరించారో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని ప్రశంసించారు.
ఎంపీలందరికీ ఆయన ఆదర్శమన్నారు. ప్రజాస్వాయ్యాన్ని బలోపేతం చేసేందుకు రాజ్యసభకు వీల్ చైర్ లో వచ్చారన్నారు.
కేంద్రానికి
వ్యతిరేకంగా కాంగ్రెస్ విడుదల కేసిన బ్లాక్ పేపర్ పై మోదీ స్పందించారు. ఆ పేపర్ తమ
ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదేనన్నారు. తమ వైపు చెడు చూపు పడకుండా నియంత్రిస్తుందన్నారు.
ప్రతిపక్షాల చర్యను స్వాగతిస్తున్నామన్నారు.
పదేళ్ళ
పాలనపై బీజేపీ వైట్ పేపర్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి కౌంటర్
గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ను విడుదల చేసింది.