గత
ఎన్నికల సమయంలో విశాఖపట్టణం విమానాశ్రయంలో
వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో అరెస్టైన శ్రీనివాస్
కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. శ్రీనివాస్‌కు ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు
చేసింది.
బెయిల్
కోరుతూ శ్రీనివాస్ పెట్టుకున్న పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, జనవరి 24
తీర్పు రిజర్వు చేసింది. నేడు షరతులతో
కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని,
వారానికి ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే
రూ. 25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది.
2018
అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ పై
దాడి జరిగింది. తనపై కోడికత్తితో జగన్ పై దాడి చేశాడనే అభియోగాలతో శ్రీనివాస్ ను
పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును తర్వాత ఎన్ఐఏ విచారించింది. బెయిల్ కోరుతూ
శ్రీనివాస్ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో అతడి తరఫు న్యాయవాదులు
హైకోర్టును విచారించారు.
ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి
సాక్ష్యం చెప్పకుండా ఆలస్యం చేస్తున్నారని దీంతో నిందితుడు జైల్లోనే
మగ్గుతున్నాడని పిటిషన్ లో పేర్కొన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం నేడు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల
శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని
ఆందోళనకు దిగారు.