రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు ప్రకటించింది. ఆర్థిక విశ్లేషకులు ఊహించిన విధంగానే రెపోరేటును యథాతథంగా కొనసాగించారు. గతంలో ఉన్న 6.5 శాతం వద్దే రెపోరేటు కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.మన వృద్ది రేటు అందరి అంచనాలను దాటనుందని ఆర్భీఐ గవర్నర్ తెలిపారు.
దేశంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం నెలకొనడంతో, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా ఉన్నట్లు చెప్పారు. ఆహార ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్భణంపై ఆహార ధరలు ప్రభావం చూపుతున్నాయి.రిటైల్ ద్రవ్యోల్భణాన్ని 4 శాతం లోపునకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆర్భీఐ గవర్నర్ చెప్పారు. ఈ ఏడాది ప్రపంచ దేశాల వృద్ది ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం గణనీయంగా పెంచడంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. పట్టణాల్లో కొనుగోలు శక్తి వేగంగా పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ గిరాకీ పెరుగుతోందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతంగా అంచనా వేశారు.