ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 135 రోజుల సుదీర్ఘ కాల్పుల విమరణ అంశాన్ని హమాస్ తెరమీదకు తెచ్చింది. హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరిస్తే మూడు దశల్లో కాల్పుల విరమణ అమల్లోకి రానుంది. హమాస్ ఉగ్ర సంస్థ ప్రతినిధులు వారి ప్రతిపాదనను ఖతార్, ఈజిప్టులోని వారి మధ్యవర్తుల బృందానికి సమాచారం పంపించారు.
గతంలో ఇజ్రాయెల్ తీసుకువచ్చిన కాల్పుల విమరణ ఒప్పందానికి బదులుగా, హమాస్ తాజా ప్రతిపాదన తీసుకువచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. ఒక్కో దశలో 45 రోజుల చొప్పున మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. సుదీర్ఘ కాల్పుల విరమణ ఒప్పందం (israel hamas war) అమల్లోకి వస్తే పాలస్తీనా ఖైదీలకు బదులుగా, ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేస్తారు.గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ అంశాన్ని హమాస్ తెరమీదకు తెచ్చింది.
మొదటి దఫాలో వృద్ధులు, పిల్లలను విడుదల చేయనున్నారు. రెండో దశలో మరణించిన వారి మృతదేహాలను మార్పిడి చేసుకుంటారు.మొత్తం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తే 1500 మంది ఖైదీలను విడుదల చేయాలని హమాస్ కోరుతోంది.హమాస్ చెరలో బందీలుగా ఉన్న 31 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం సమాచారం అందించింది. హమాస్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదనలు వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు