ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్రా జిల్లా బైరియో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది (two crpf jawans killed) ప్రాణాలు కోల్పోయారు. బస్తర్‌నగర్, సదర్ మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఝార్ఖండ్ రాజధాని రాంఛీకి 200 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది.
నక్సల్స్ కాల్పుల్లో చనిపోయిన వారిలో గయాలోని వజీర్‌గంజ్‌కు చెందిన సికందర్ సింగ్, పాలముకు చెందిన సుకన్ రామ్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఆకాశ్ సింగ్‌ను రాంచీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నక్సల్స్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.మావోయిస్టుల కోసం గాలింపు జరిపి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బందిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తృతీయ సమ్మేళన్ ప్రస్తుతి కమిటి ఈ దాడికి దిగినట్లు గుర్తించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు