రాష్ట్రప్రభుత్వ
ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్
2024 నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
6,100
ఖాళీల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టుల భర్తీ
చేయనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అలాగే 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ
పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు
మంత్రి పేర్కొన్నారు.
ఫిబ్రవరి
12 నుంచి నియామక ప్రక్రియ ప్రారంభించి ఏప్రిల్ 7న ప్రకటన విడుదల చేసేలా కార్యాచరణ
జరుగుతుందన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఫిబ్రవరి
8 నుంచి టెట్ ప్రక్రియ ప్రారంభ కానుంది. 23 తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్
చేసుకోవచ్చు. 27 నుంచి మార్చి 9 లోపు రెండు సెషన్స్ లో టెట్ పరీక్షలు
నిర్వహిస్తారు. ప్రైమరీ కీ పేపర్ మార్చి 10న విడుదల చేసి 11 వ తేదీ వరకు
అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ మార్చి 13న విడుదల చేసి, మరుసటి రోజు అంటే
మార్చి 14న టెట్ ఫలితాలు వెల్లడిస్తారు.
ఈ
నెల 12 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. మార్చి 5 నుంచి హల్ టికెట్ల
డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్స్ లో పరీక్షలు
నిర్వహించి మార్చి 31 న కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న కీపై అభ్యంతరాలు
స్వీకరించి, ఏప్రిల్ 2 ఫైనల్ కీ పేపర్ విడుదల చేస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తారు.
వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు
మంత్రి తెలిపారు. మరిన్ని వివరాల కోసం http://cse.ap.gov.in/loginhome
సంప్రదించాలని సూచించారు.