పేదల సంక్షేమమే లక్ష్యంగా
వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.
శాసనసభలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, అంబేద్కర్ ఆశాయాలను తమ
ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క బలహీనవర్గాన్నీ
విస్మరించకూడదన్న మాజీ సీఎం వైఎస్ స్ఫూర్తితో బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు.
వార్షిక బడ్జెట్ రూ. 2,86,389.27
కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41
కోట్లుగా ఉంది. మూలధన వ్యయం రూ. 30,530.18
కోట్లు, రెవెన్యూ
లోటు రూ. 24,758.22 కోట్లు, ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు గా బడ్జెట్ గణంకాలు
ఉన్నాయి.
పేదరికం
కారణంగా విద్యార్థులు చదువుకు దూరంకాకూడదనే ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక
పథకాన్ని అమలు చేశామన్నారు.
ఇందుకోసం ప్రభుత్వం రూ.3367 కోట్లు
ఖర్చుచేసిందని వివరించారు. జగనన్న విద్యాదీవెన పథకానికి రూ.11,901 కోట్లు, జగనన్న వసతి
దీవెన పథకానికి రూ.4,267 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయధారులను
ప్రోత్సహించేందుకు రైతు భరోసా – పీఎం
కిసాన్ పథకాలకు రూ.33.3 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపిన మంత్రి బుగ్గన, వైఎస్సార్
చేయూత పథకానికి రూ.14,129 కోట్లు కేటాయించామన్నారు.
ఉచిత పంటల బీమా పథకానికి రూ.3,411 కోట్లు, సున్నా వడ్డీ పంట
రుణాలకు రూ. 1,835 కోట్లు ఇచ్చామన్నారు.
బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి
రూ. 71,740 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ. 20 వేల కోట్లతో నాలుగు ఓడరేవుల
నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. తాగునీటి పథకం కో సం రూ. 10, 107
కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిధులు కేటాయించింది.