కర్ణాటక
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక
న్యాయస్థానం ఆదేశించింది. బీజేపీ నేతల నిరసనకు సంబంధించి మార్పింగ్ ఫొటోను విడుదల చేయడంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. శివకుమార్‌తో పాటు, కర్ణాటక కాంగ్రెస్ ఐటీ సెల్
అధ్యక్షుడు బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు
జారీ చేసింది.
అయోధ్యలో
వివాదాస్పడ కట్టడం కూలగొట్టిన ఘటనలో పాల్గొన్న శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని ఇటీవల
కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ఈ
అరెస్టు జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ శాఖ నిరసన వ్యక్తం చేసింది.
‘‘ నేను కర
సేవకుడినే, నన్నూ అరెస్టు చేయండి’’ అని నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని
బీజేపీ నేతలు ఆందోళన దిగారు. ఈ నిరసనకు సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ పార్టీ, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ
గౌరవానికి భంగం కల్పించిందని బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడినట్లుగా అర్థం
వచ్చే లా మార్చిన ఫొటోలను కాంగ్రెస్ ఐటీ సెల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలను
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా తన అకౌంట్ నుంచి షేర్
చేశారు.
దీనిపై
బీజేపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే మార్పింగ్
ఫొటోను షేర్ చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర
హొడగట్ట కోరారు. విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు, క్రిమినల్ కేసు
బుక్ చేయాలని పోలీసులను ఆదేశించింది.