Thousand years old Lord Vishnu idol and Shiv Ling found in Krishna riverbed
భారతదేశంలో ఏ మూల కొద్దిగా తవ్వినా హిందూధర్మం
జాడలు కనిపిస్తుంటాయి. సనాతనధర్మం ప్రాచీనతను చాటిచెప్పే ఆనవాళ్ళు కోకొల్లలు.
హిందూద్వేషులైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, క్రైస్తవులు, ముస్లిములు హైందవం
గొప్పదనాన్నీ, ప్రాచీనతనూ అంగీకరించకపోయినా అడుగడుగున బయటపడే సాక్ష్యాలెన్నో.
అలాంటి మరో గొప్ప పురాతన విగ్రహాలు తాజాగా లభ్యమయ్యాయి.
తెలంగాణ – కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణానదీ
పరీవాహకప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం లభించాయి. కర్ణాటక
రాష్ట్రం రాయచూరులో కృష్ణానది మీద బ్రిడ్జి కట్టడానికి తవ్వకాలు జరుపుతుండగా ఈ
దేవతామూర్తులు లభ్యమయ్యాయి. ఈ విగ్రహాలు కనీసం వెయ్యేళ్ళ ప్రాచీనమైనవి అని అంచనా
వేస్తున్నారు.
ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ విష్ణుమూర్తి విగ్రహం
ఇటీవలే అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలక్‌రామ్ మూర్తిని పోలి ఉంది. విష్ణుమూర్తి నాలుగింట
రెండు చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి. మూర్తి చుట్టూ ఉన్న తోరణం మీద దశావతారాలు చెక్కి
ఉన్నాయి.
నదీగర్భంలో దొరికిన విష్ణుమూర్తి
విగ్రహాన్ని, శివలింగాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ – ఆర్కియలాజికల్ సర్వే
ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) తమ అధీనంలోకి తీసుకుంది.