AP Cabinet approves Vote on Account Budget
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర
మంత్రిమండలి ఈ ఉదయం సమావేశమైంది. 2024–25 ఆర్ధిక
సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది.
ఈ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని ఆమోదించారు.
నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా
హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ఆ కళాశాల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది.
నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో
రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ఆ కళాశాల ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్
(ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేట్
యూనివర్శిటీలకు అనుమతించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ,
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి
గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య
యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.