అండర్ -19 వరల్డ్కప్ సెమీఫైనల్లో భారత్ విజయం సాధించి ఫైనల్ లోకి
అడుగుపెట్టింది. రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఓడించించి ఐదోసారి
ఫైనల్ లోకి వెళ్ళింది. దక్షిణాఫ్రికా
విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని 48.5
ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి ఛేదించింది.
దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన సెమీఫైనల్-1 పోరులో టాస్ గెలిచిన భారత కుర్రాళ్ళ జట్టు బౌలింగ్
ఎంచుకుంది. ట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 244 పరుగులు చేసింది. 245 పరుగుల లక్ష్యాన్ని
ఛేదించేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
సచిన్ దాస్,
కెప్టెన్ ఉదయ్ సహారన్ జోడీ నేర్పుగా ఆడి జట్టువిజయానికి బాటలు
వేశారు. సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు చేయగా, కెప్టెన్
ఉదయ్ సహారన్ 81 పరుగులు చేశాడు. ఈ జోడి ఐదో వికెట్ కు 171 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.
చివర్లో కూడా భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
రాజ్ లింబానీ, 13 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో
క్వెనా మఫాకా , ట్రిస్టాన్ లూస్ చెరో మూడు వికెట్లు తీశారు.
రెండో
సెమీఫైనల్-2 పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజేతతో భారత్ జట్టు ఫిబ్రవరి 11న ఫైనల్
ఆడనుంది.