Chile former president dies in helicopter crash
దక్షిణ అమెరికా దేశం చిలీ మాజీ అధ్యక్షుడు
సెబాస్టియన్ పినేరా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కోటీశ్వరుడైన
సెబాస్టియన్ పినేరా, దక్షిణ చిలీలోని లాస్ రియోస్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా
హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో నలుగురు
ప్రయాణిస్తున్నారు. వారిలో సెబాస్టియన్ పినేరా ఒక్కరే మరణించారు. మిగతా ముగ్గురికీ
తీవ్రగాయాలయ్యాయి. వారికి ప్రాణాపాయం తప్పిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి
కెరోలినా టోహా ప్రకటించారు. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో భారీ వర్షం కురుస్తోంది.
అయితే ప్రమాదానికి వాతావరణం ఎంతవరకూ కారణం అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా
స్థలం నుంచి పినేరా మృతదేహాన్ని వెలికితీసారు.
పినేరా వయసు 74 సంవత్సరాలు. అమెరికాలోని
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన చిలీ దేశానికి 2010 నుంచి 2014
వరకూ, ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకూ రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసారు. ఆయన
మృతికి సంతాపసూచకంగా మూడు రోజులు దేశమంతా సంతాప దినాలు ప్రకటించారు.