కలరా
ప్రబలి అల్లాడుతున్న జాంబియా దేశానికి భారత్ మానవతా సాయం అందజేసింది. ఆపద్కాలంలో ఆ
దేశానికి భారత్ 3.5 టన్నుల సాయం అందజేసి ఆదర్శంగా నిలిచింది. ఔషధాలతో పాటు నీటి
శుధ్ధి యంత్రాలను భారత్, జాంబియాకు పంపింది. కలరాకు అడ్డుకట్ట వేసే క్లోరిన్ మాత్రలు,
ఓఆర్ఎస్ ప్యాకెట్లును భారత్ సాయంగా అందజేసింది.
జాంబియాలో
మునుపెన్నడూ లేనివిధంగా కలరా కేసులు పెరుగుతున్నాయ. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఈ
రోగం కారణంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 15 వేల మంది ఈ ఇన్ఫెక్షన్
తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
దేశంలో మొత్తం పది ప్రావిన్సులు ఉండగా తొమ్మిది
ప్రావిన్సులో వ్యాధి ప్రబలడంతో పలువురు మంచాన పడ్డారు. దీంతో స్టేడియాలు, ప్రైవేటు ఆఫీసుల్లో తాత్కాలిక
ఆస్పత్రులు ఏర్పాటు చేసి చికిత్స అందజేస్తున్నారు.
మాస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించడంతో
పాటు ప్రభావిత ప్రాంతాలకు శుద్ధి చేసిన
తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పరిస్థితి భయంకరంగా ఉండటంతో విశ్రాంతి వైద్య
ఉద్యోగులను కూడా విధుల్లోకి తీసుకున్నారు.
కలరాను
అరికట్టేందుకు జాంబియా, శక్తికి మించి శ్రమిస్తోంది. అయితే భారీ వర్షాల పడటంతో
శుద్ధమైన తాగునీటి సరఫరాకు అడ్డంకి ఏర్పడింది.
సాధారణంగా కలరాతో మరణాల రేటు ఒక
శాతం కంటే తక్కువ ఉంటుంది. కానీ జాంబియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ వ్యాధి
కారణంగా మరణించిన వారి శాతం నాలుగుశాతం కంటే ఎక్కువ ఉండటం కలవర పెడుతోంది.