లష్కరే-
ఏ-తయిబా తీవ్రావద సంస్థతో సంబంధమున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన రియాజ్
అహ్మద్, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే సమాచారంతో దిల్లీ రైల్వే స్టేషన్
లో అదుపులోకి తీసుకున్నారు.
జమ్ము-కశ్మీర్,
కుప్వారా జిల్లా పరిధిలో తీవ్రవాదుల కుట్రను ఛేదించే విచారణలో భాగంగా పోలీసులు
నిర్వహించిన సోదాలతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గుహ్లామ్
సార్వార్ రాథర్ తో కలిసి రియాజ్ తీవ్రవాద చర్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో
తేలింది. పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ
రేఖ వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారత్ లోకి చేర్చడంలో రియాజ్ కీలకపాత్రధారిగా
ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
రియాజ్
నుంచి ఓ మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు సంబంధిత సెక్షన్ల
కింద కేసు నమోదు చేశారు.