మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంపీలోని హర్దాలో బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు (explosion broke out fire cracker factory) చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. మంటలతోపాటు పేలుళ్లు సంభవించాయి. భారీ శబ్దాలు రావడంతో సమీప ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు.
మంటల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఓ అధికారి ప్రకటించారు. పేలుడు తీవ్రతకు మాల్వా ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు ప్రజలు చెబుతున్నారు.
ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీనియర్ అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన వారిని భోపాల్, ఇండోర్‌లోని వైద్య కళాశాలలకు తరలించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయని అధికారులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు 150 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్లు ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ కార్మికుడు మీడియాకు వెల్లడించాడు.