ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. లిక్కర్ కుంభకోణంలో, మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (delhi cm arvind kejriwal) ఈడీ అధికారులు ఇప్పటికే ఐదుసార్లు సమన్లు పంపారు. తాజాగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు చెందిన ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ జల్ బోర్డు మాజీ సభ్యుడు శలబ్ కుమార్, ఆప్‌తో సంబంధం ఉన్న నేతల కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాజకీయ కక్షతో ఆప్ నేతలను అణచివేసేందుకు దాడులు జరుపుతున్నారని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. లిక్కర్ కుంభకోణంలో అవాస్తవ వాంగ్మూలాలను సేకరించడానికి ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని అతిశీ ధ్వజమెత్తారు . ఇప్పటికే మంత్రి అతిశీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం కుంభకోణంలో పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, నిందితులకు సమన్లు జారీ చేశారు.